ద్రోణం రాజు శ్రీనివాస్ మృతి

వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి చెందారు. ద్రోణం రాజు శ్రీనివాస్ కరోనా బారిన పడ్డారు. ఆయన కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా నుంచి [more]

Update: 2020-10-04 12:50 GMT

వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి చెందారు. ద్రోణం రాజు శ్రీనివాస్ కరోనా బారిన పడ్డారు. ఆయన కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న శ్రీనివాస్ ఈరోజు ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందారు. విశాఖ నుంచి రెండుసార్లు ద్రోణంరాజు శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో అధికారంలోకి రాగానే జగన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ను విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలెప్ మెంట్ అధారిటీ ఛైర్మన్ గా నియమించారు. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతితో విశాఖ వైసీపీలో విషాదచాయలు అలుముకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News