మనసా…వాచా..కర్మణా….!!!
ఓట్ల కోసం కాకుండా, అమలు చేయగలిగిన హామీలే మేనిఫెస్టో రూపంలో ఇస్తున్నామని, మానసా, వాచా, కర్మణా మానిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలను అమలు చేస్తామని వైస్సార్ కాంగ్రెస్ [more]
ఓట్ల కోసం కాకుండా, అమలు చేయగలిగిన హామీలే మేనిఫెస్టో రూపంలో ఇస్తున్నామని, మానసా, వాచా, కర్మణా మానిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలను అమలు చేస్తామని వైస్సార్ కాంగ్రెస్ [more]
ఓట్ల కోసం కాకుండా, అమలు చేయగలిగిన హామీలే మేనిఫెస్టో రూపంలో ఇస్తున్నామని, మానసా, వాచా, కర్మణా మానిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలను అమలు చేస్తామని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉగాది పర్వదినాన ఆయన అమరావతిలోని పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో విజయం సాధించేందుకు చంద్రబాబు 600కు పైగా అబద్దపు హామీలు ఇచ్చారని, కులానికి ఒక పేజీ కేటాయించి అందరిని మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆ పార్టీ మేనిఫెస్టో మాయం చేశారని పేర్కొన్నారు. తమ మేనిఫెస్టో వారి మాదిరి గా బుక్ ఉండదని, అబద్దపు హామీలు ఉండవని స్పష్టం చేశారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేలా తమ మేనిఫెస్టో ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి రోజు మేనిఫెస్టో అమలు పై రివ్యూ చేస్తామని స్పష్టం చేశారు. ఈ మ్యానిఫెస్టోను అమలు చేశాకనే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు.
వైసీపీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు
* ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఐదేళ్లలో 50వేలు. పంట వేసే సమయానికి ప్రతి సంవత్సరం మే నెలలోనే 12500.
* రైతులకు బోర్లు ప్రభుత్వమే వేయిస్తుంది, రైతులకు పగటి పూట 9 గంటలు విద్యుత్.
* ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి 7 లక్షలు.
* పంట వేసే ముందే గిట్టుబాటు ధరలకు హామీ.
* కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు
* 5 లక్షల లోపు ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలకు హెల్త్ కార్డులు.
* ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ అమలు. 1000 రూపాయలు వైద్య ఖర్చులు దాటితే ఆరోగ్యశ్రీ పరిధి లోకి వస్తుంది.
* దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకి 10,000 పెన్షన్.
* ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ఇంగ్లీష్ మీడియం విద్య.
* ప్రతి గ్రామంలో గ్రామా సచివాలయం. అందులో 10 మంది యువతకు వాలంటీర్ గా ఉద్యోగాలు.
* ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ.
* పిల్లలను బడులకు పంపితే తల్లులకు ఏడాదికి 10 వేలు.
* పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి.
* ఉద్యోగాల భర్తీకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలండర్.
* ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు 75 శతం ఉద్యోగాలు ఇచేలా రిజర్వేషన్.
* అగ్రిగోల్డ్ బాధితులకు 11,50 కోట్లు.
* కాపుల సంక్షేమానికి ఐదేళ్లలో 10 ఫోర్ కోట్లు.
* అగ్రవర్ణ పేదలకు కార్పొరేషన్లు.
* పూజారులు, పోస్టర్లు, ఇమాంలకు ఇల్లు, పెన్షన్.
* ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా.
* పోలీసులకు వీక్లీ ఆఫ్.