మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈరన్న కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురయింది. ఈరన్న గత ఎన్నికల్లో మడకశిర నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పేస్వామి ఈరన్న ఎన్నిక చెల్లదని హైకోర్టును ఆశ్రయించారు.ఈరన్న అఫడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆరోపించారు.
సుప్రీంకోర్టులోనూ చుక్కెదురే....
సుదీర్ఘకాలం సాగిన వాదనలతో ఇటీవల హైకోర్టు ఈరన్న ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. రెండో స్థానంలో నిలిచిన తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ఎన్నికయినట్లుగా హైకోర్టు ప్రకటించింది. కాని హైకోర్టు తీర్పుపై ఈరన్న సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే ఈరన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో వైసీపీ గుర్తుపై పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు మార్గం సుగమమయింది.