అంబటికి సీటు ఇవ్వొద్దు
మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి సీటు కేటాయించవద్దంటూ పలువురు వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. తాడేపల్లిలో గురువారం దాదాపు యాభై మంది సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన వైకాపా ముఖ్య నాయకులు ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారు. సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ఎంపీని కలిసిన వారిలో ఉన్నారు. ముప్పాళ్ల మండలం, సత్తెనపల్లి రూరల్ మండలం, సత్తెనపల్లి పట్టణానికి చెందిన నాయకుల్లో చాలామంది అంబటి రాంబాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.
సత్తెనపల్లి వైకాపా నేతల విజ్ఞప్తి

అంబటి రాంబాబు జగన్ ప్రభుత్వంలో కీలక నాయకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జలవనరుల శాఖ మంత్రి అయిన రాంబాబు ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో దిట్ట. తనదైన శైలిలో ఆరోపణలు చేస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఆయన టార్గెట్ చేస్తుంటారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వద్దని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.