బాబు ఆరోపణలకు ఆధారాలతో సహా కౌంటర్
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కుటుంబసభ్యులపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధారాలతో సహా తిప్పికొట్టింది. ఇవాళ వైసీపీ లీగల్ సెల్ [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కుటుంబసభ్యులపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధారాలతో సహా తిప్పికొట్టింది. ఇవాళ వైసీపీ లీగల్ సెల్ [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కుటుంబసభ్యులపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధారాలతో సహా తిప్పికొట్టింది. ఇవాళ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఒక దురదృష్టకర సంఘటన జరిగితే బాధితులపైనే ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ధికి వాడుకోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా వివేకాను ఇంట్లోవారే హత్య చేశారని దారుణమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజల మనస్సులు చూరగొనాలంటే ఇది సరైన విధానం కాదని ఆయన పేర్కొన్నారు. సిట్ ఇంకా విచారణ కూడా ప్రారంభించకముందు ఆధారాలు చెడిపేశారని చంద్రబాబు అబద్ధాలు చెప్పి ఎందుకు అనుమానాలు రేగేలా చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్, శవ పంచనామా రిపోర్టు, మృతదేహం ఫోటోలు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను మీడియా ముందు ప్రదర్శించారు.
చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు వైసీపీ లీగల్ సెల్ సమాధానాలు
చంద్రబాబు ఆరోపణ: వివేకా ఒంటిపై గాయాలున్నా గుండెపోటు అని ఎందుకు ఫిర్యాదు చేశారు? గాయాలు ఉన్న విషయం దాచిపెట్టారు. పోస్టుమార్టం తర్వాత హత్య అని తామే చెప్పాము.
వైసీపీ లీగల్ సెల్: వివేకానంద రెడ్డి పీఏ ఫిర్యాదు మేరకు ఉదయం 8 గంటలకే అనుమానాస్పద మృతి కింది ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫిర్యాదులోనే తాము మృతదేహంపై చాలా గాయాలున్నాయని, పదునైన ఆయుధంతో దాడి జరిగిందని చెప్పాము. ఎఫ్ఐఆర్ లోనే ఎక్కడెక్కడ గాయాలయ్యాయో నమోదు చేయించాం. పోస్టుమార్టం దాకా గాయాలు దాచి పెట్టామనడం అబద్ధం. ఎఫ్ఐఆర్ చూస్తే నిజం తెలుస్తుంది.
చంద్రబాబు ఆరోపణ: శవ పంచనామా చేయకుండా మృతదేహాన్ని తరలించారు.
వైసీపీ లీగల్ సెల్: ఉదయం 9 గంటలకే శవ పంచనామా జరిగింది. శవ పంచనామాలో మృతదేహంపై ఉన్న ప్రతీ ఒక్క గాయం రాసి ఉంది. శవ పంచనామా రిపోర్టు చూడవచ్చు.
చంద్రబాబు ఆరోపణ: రక్తం తుడిచేశారు. ఆధారాలు చెడిపేశారు. బట్టలు తీసేశారు.
వైసీపీ లీగల్ సెల్: విచారణ ప్రారంభించాక పోలీసులు తీసిన ఫోటోల్లో మృతదేహం వద్ద రక్తం అలాగే ఉంది. శవ పంచనామాలో కూడా వివేకానందరెడ్డి ఏ బట్టలతో ఉన్నారో స్పష్టంగా రాసి ఉంది.