రాజీనామాకు సిద్ధమైన రోజా .. రీజనిదే
అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా రోజా సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా ప్రభుత్వం చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరి నియోజకవర్గానికి చెందిన చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రోజాకు, చక్రపాణిరెడ్డికి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. నగరిలో ఏ కార్యక్రమం చేపట్టినా చక్రపాణిరెడ్డి వేరుగా పార్టీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
జగన్ ను కలిసి....
రోజాపై చక్రపాణిరెడ్డి బహిరంగ సవాల్ నుకూడా విసిరారు. వచ్చే ఎన్నికల్లో తన మద్దతు లేెకుండా ఎలా గెలుస్తావో చూస్తానంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో చక్రపాణిరెడ్డికి శ్రీశైలం బోర్డు ఛైర్మన్ పదవి ఇవ్వడంపై రోజా తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నట్లు తెలిసింది. అవసరమైతే జగన్ ను కలిసి తన నిరసనను తెలియజేసే అవకాశముంది. అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా రోజా సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.