బిగ్ న్యూస్ : పాలేరు నుంచే పోటీ చేస్తా
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చారు. పాలేరు నుంచి పోటే చేస్తానని తెలిపారు.
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చారు. తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటే చేస్తానని తెలిపారు. పాలేరు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడారు. తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతానని కార్యకర్తలకు స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం ఇక్కడి నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
వైఎస్సార్ పేరు పలికే...
ఖమ్మం జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్ ఫొటోతో గెలిచారని షర్మిల చెప్పారు. వైఎస్సార్ మీద ఉన్న అభిమానమే తన ఆస్తి అని కార్యకర్తలకు షర్మిల చెప్పారు. పాలేరులో తాను పోటీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. తెలంగాణలో వైఎస్సార్ పేరు పలికే అర్హత తనకే ఉందని షర్మిల చెప్పారు. అందుకే పాలేరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని షర్మిల ప్రకటించారు.
ముందుగానే...
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి షర్మిల తెర దించారు. తెలంగాణలో పార్టీ పెట్టిన నాటి నుంచి వైఎస్ షర్మిల ఒక వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. మిగిలిన పార్టీల కంటే ముందుగా జనంలోకి వెళ్లేందుకు పాదయాత్రను ఎంచుకున్నారు. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోనే షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది.