అన్ని కులాలవారిని సంతృప్తి పర్చేలా

Update: 2018-03-08 07:03 GMT

ఎన్నికల వేళ అన్ని సామాజిక వర్గాలనూ సంతృప్తి పర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కు రూపకల్పన చేశారు. వెనుకబడిన వైశ్యులకు 35 కోట్లు కేటాయించారు. అలాగే దూదేకుల సామాజిక వర్గం అభివృద్ధి కోసం 40 కోట్లు, నాయీ బ్రాహ్మణులకు 30 కోట్లు, వెనుకబడిన తరగతుల సంస్థకు వంద కోట్లు, వాల్మీకీ, బోయిల అభివృద్ధికి యాభై కోట్ల రూపాయలు, కల్లుగీత కార్మికుల సంక్షేమానికి 70 కోట్లు, ఎస్సీ, బీసీ వధువులకు చంద్రన్న పెళ్లికానుక కింద 200 కోట్లు, బీసీ స్కాలర్ షిప్ లు, ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకానికి 2,160 కోట్ల రూపాయలు, ఆదరణ పథకానికి 750 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. ఆదరణ పథకం ద్వారా 2.50 లక్షలమందికి లబ్దిచేకూరుతుందని చెప్పారు. బీసీ కార్పొరేషన్ కు 600 కోట్ల రూపాయలను కేటాయింపులు జరిపారు. ఇమాం, మౌజమ్ లకు ప్రోత్సాహకాలు అందించడానికి 75 కోట్లు కేటాయింపులు జరిపారు.

Similar News