అసెంబ్లీలో సీన్ మారిందే

Update: 2018-03-21 11:34 GMT

ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు సీన్ మారింది. ప్రతిపక్ష వైసీపీ లేకపోవడంతో ఇప్పుడు బీజేపీయే ప్రతిపక్షంగా మారింది. ఏపీ అసెంబ్లీలో పట్టిసీమపై జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. పట్టిసీమలో 371 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. పట్టిసీమలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు. 190కోట్లు పట్టిసీమలో ప్రభుత్వం వృధాగా ఖర్చు పెట్టిందని కాగ్ స్పష్టం చేసిన విషయాన్ని విష్ణుకుమార్ రాజు గుర్తు చేశారు. పట్టిసీమలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ తోగాని, సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే బీజేపీ ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొట్టింది. పట్టిసీమలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది. మిత్రపక్షంగా వైదొలిగిన తర్వాతనే పట్టిసీమలో అవినీతి గుర్తొచ్చిందా? అని మంత్రులు దేవినేని, అచ్చెన్నాయుడులు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని వారు సూచించారు.

Similar News