నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. నంద్యాల రూరల్ లోనూ టీడీపీకే ఆధిక్యత కన్పించింది. రౌండ్ల వారీగా ఓట్లను పరిశీలిస్తే టీడీపీ ఎక్కడా తగ్గలేదు. ఆరో రౌండ్లోనూ టీడీపీకే ఆధిక్యం దక్కింది. వైసీపీ ఏ రౌండ్ లోనూ ఆధిక్యత కనబర్చక పోవడం విశేషం.ఆరో రౌండ్ లో 3, 303 ఓట్ల మెజారిటీ లభించింది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆరు రౌండ్లు ముగిసే సమయానికి 16465 ఓట్ల ఆధిక్యం లభించింది.