ఆర్యవైశ్యులపై ఐలయ్యే గెలిచారు

Update: 2017-10-13 08:11 GMT

ఆర్యవైశ్యులను కించపరుస్తూ పుస్తకం రాశారని ఆరోపిస్తూ కంచె ఐలయ్యపై వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. తాము పుస్తకాన్ని నిషేధించలేమని చెప్పింది. రచయితలే నియంత్రణ పాటించాలని పేర్కొంది. ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. కంచె ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ నిరసనలను కూడా చేశారు. అయితే పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ ఆర్యవైశ్య సంఘం నేత, ప్రముఖ న్యాయవాది రామాంజనేయుుల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం తాము పుస్తకాన్ని నిషేధించలేమని స్పష్టంగా చెప్పింది. పుస్తకాన్ని నిషేధిస్తే భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లే అవుతుందని అభిప్రాయపడింది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పిటిషన్ ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై కంచె ఐలయ్య హర్షం వ్యక్తం చేశారు. తీర్పును తాను సాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News