ఏపీ సచివాలయ ఉద్యోగుల ధర్నా

Update: 2017-09-25 07:14 GMT

ఏపీ సచివాలయ ఉద్యోగులకు బయో మెట్రిక్‌ సెగ తాకింది. ఇన్నాళ్లు ఇష్టానుసారం ఆఫీసులకు వస్తుండటంతో బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేశారు. దీంతో సోమవారం గుంటూరు నుంచి బస్సుల్లో వెలగపూడి బయల్దేరిన ఉద్యోగులు అవి మెల్లగా ఆగుతూ సాగుతుండటంతో ఆగ్రహానికి గురయ్యారు. తాడికొండ దగ్గర నాన్‌స్టాప్‌ బస్సులు దిగి ఆందోళన బాట పట్టారు. నాన్‌స్టాప్‌ బస్సులని బోర్డులు పెట్టి ఆర్డినరీ సర్వీసుల మాదిరి ప్రతి స్టాప్‌లో ఆపడం వల్ల తమకు లేట్‌ అవుతోందని ఆందోళనకు దిగారు. ఆక్యుపెన్సీ పేరుతో అన్ని స్టాపుల్లో బస్సులు ఆపడం వల్ల ఇబ్బందిగా ఉంటోందని చెబుతున్నారు. సమస్యను పరిష్కరించే వరకు విధులకు వెళ్లేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాలినాడకనే సచివాలాయానికి బయల్దేరి వెళ్లారు.

Similar News