కటీఫ్ చెప్పడానికి కారణం అదేనన్న కేంద్రమంత్రి

Update: 2018-03-08 04:12 GMT

ప్రధానిని కలిసి తాము రాజీనామాలు చేస్తామని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పడం, విభజన హామీలు అమలు చేయకపోవడం వల్లనే కేంద్రం నుంచి వైదొలుగుతున్నామని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ని వెంటవెంటనే అమలు చేసి ఉంటే ఈ పరిణామాలు సంభవించి ఉండేవి కావన్నారు. మంత్రి పదవిలో ఉన్నా, లేకున్నా రాష్ట్ర హక్కుల సాధన కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్న తరుణంలో స్పీకర్ అనుమతి తీసుకుని పార్లమెంటులో అందుకు గల కారణాలను వివరించాలని కేంద్రమంత్రులు భావిస్తున్నారు. ప్రధాని మోడీ రాజస్థాన్ పర్యటకు ముందే మంత్రులు కలుస్తారా? వచ్చిన తర్వాత కలుస్తారా? అన్నది తెలియరాలేదు. ఉదయం 11గంటల తర్వాత రాజీనామాలను ఎవరికి ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Similar News