కాకి లెక్కల్లో టీడీపీ, వైసీపీ

Update: 2017-08-24 04:30 GMT

నంద్యాల ఉపఎన్నికలు ముగిసాయి . హోరాహోరీగా సాగిన ఈ పోరులో విజేత ఎవరు ..? పరాజితులు ఎవరన్నది కొద్ది రోజులు సస్పెన్స్ నడవక తప్పదు . ఈలోగా ఎవరి కాకి లెక్కలు వారు వేసుకునే బిజీ లో ఉండగా కోట్ల రూపాయల బెట్టింగ్ ఈ ఫలితం పై రాష్ట్రవ్యాప్తంగా నడుస్తుంది . దశాబ్ద కాలం తరువాత రికార్డ్ స్థాయిలో 79.2 శాతం నమోదైన ఓటింగ్ ఎవరికి మోదాన్ని ఎవరికి ఖేదాన్ని అందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది .

గోస్పాడు పైనే వైసిపి ఆశలు ....

ఎన్నికల ముందు నుంచి గోస్పాడు మండలం వైసిపి ఆధిక్యం సాధించి తీరుతుందన్న ప్రచారం మొదలై ఓటింగ్ పూర్తి అయ్యాకా కూడా అదే వినపడటం విశేషం . ఈ మండలం లో 90 శాతం పోలింగ్ నమోదు కావడంతో వైసిపి క్యాడర్ నుంచి అభ్యర్థి వరకు విజయంపై ధీమాగా వున్నాయి . తాము ఊహించిన విధంగానే ఓటింగ్ సరళి నడిచిందని ఆ పార్టీ క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తుంది .

నంద్యాల అర్బన్ పై టిడిపి ఆశలు....

అధికార టిడిపి నంద్యాల టౌన్ పై ఆశలు పెట్టుకుంది . విద్యావంతులు , తటస్థులు తమవైపే వున్నారని , జరుగుతున్న అభివృద్హి పనులు గమనించి వాటికి కొనసాగింపు కోరుకుంటారు కనుక మెజారిటీ ఓట్లు భూమా కుటుంబం వైపే వచ్చాయన్నది వారి అంచనా . ఇక రూరల్ మండల ఓట్లు నువ్వా నేనా అన్న విధంగా పడ్డాయని అంటున్నారు . దాంతో రెండు శిబిరాలు విజయంపై పూర్తి ధీమాగా వున్న పరిస్థితుల్లో తెలుగు వారిలో ఫలితంపై మరింత ఉత్కంఠ పెరిగిపోతుంది .

Similar News