జగన్ కు ఝలక్ ఇచ్చిన అమిత్ షా

Update: 2017-08-26 14:19 GMT

వైసీపీతో పొత్తు పెట్టుకునేది లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. తాము కొత్త పార్టీలతో పొత్తు పెట్టుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతోనే తమ మైత్రీబంధం కొనసాగుతుందని తెలిపారు. దీంతో గత కొంత కాలంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మోడీతో వైసీపీ అధినేత జగన్ కలవడం, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలలో బేషరతుగా ఎన్డీఏకు వైసీపీ మద్దతివ్వడంతో ఆ వార్తలకు బలం చేకూరాయి. అయితే ఈ వార్తలను అమిత్ షా తోసిపుచ్చారు. శనివారం ఆయన మీడియాకు స్పష్టం చేశారు. టీడీపీతో తమకు మంచి సంబంధాలున్నాయన్న అమిత్ షా, టీడీపీతోనే పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Similar News