జగన్ కేసులో 23న తీర్పు

Update: 2017-10-20 10:59 GMT

కోర్టు కేసుల్లో తనకు ప్రతి శుక్రవారం హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీబీఐ కూడా కోర్టులో కౌంటర్ పిటీషన్ వేసింది. ఈరోజు ఇటు జగన్ తరుపున, అటు సీబీఐ వాదనలు విన్పించాయి. తాను ఆరు నెలల పాటు కోర్టుకు హాజరుకాలేనని, ఏపీలోని మారు మూల ప్రాంతంలో ఉంటానని జగన్ తరుపున న్యాయవాది వాదించారు. అయితే సీబీఐ మాత్రం ఆరు నెలల పాటు జగన్ కోర్టుకు హాజరుకాకపోతే ట్రయల్ లో జాప్యం జరుగుతుందంది. హైకోర్టు కూడా ఈ కేసులను త్వరగా ముగించాలని చెప్పిన విషయాన్ని సీబీఐ న్యాయవాది గుర్తు చేసింది. అయితే రెండు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 23న తీర్పు చెప్పనుంది. 23న జగన్ పాదయాత్రకు బ్రేకులు పడతాయా? నిరాటంకంగా ముందుకు వెళుతుందా అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Similar News