వైసీపీ అధినేత జగన్ లోటస్ పాండ్ లోని తన ఇంట్లోనే ఉండి నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు. లోటస్ పాండ్ కు వైసీపీ సీనియర్ నేతలు చేరుకున్నారు. అయితే తొలి రెండు రౌండ్లే కావడంతో పెద్దగా పట్టించుకోనవసరం లేదంటున్నారు వైసీపీ నేతలు. జ్వరంతో బాధపడుతున్న జగన్ ఇంట్లోనే ఉండి నంద్యాల ఫలితాలను టీవీలో వీక్షిస్తున్నారు. నంద్యాల పట్టణం, గోస్పాడు మండలంలో మెజారిటీ వస్తుందని వైసీపీ నేత జగన్ భావిస్తున్నారు.