జోరు మీదున్న జగన్

Update: 2017-10-17 13:42 GMT

జగన్ జోరు మీదున్నారు. వరాల మీద వరాలు కురిపిస్తున్నారు. చేనేత కార్మికుల నిరాహారదీక్ష అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో 36 రోజులకు చేరుకున్న సందర్భంగా జగన్ అక్కడకు వెళ్లి నిరాహార దీక్ష చేస్తున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా చేనేత, వృత్తి కార్మికులకు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 45 ఏళ్లకే పింఛను ఇస్తానని ప్రకటించారు. వృత్తి పనులు చేసుకునే వారు 45 ఏళ్లకే శారీరకంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని అందుకోసమే 45 ఏళ్లు నిండిన చేతివృత్తుల వారికి పింఛను మంజూరు చేస్తామని ప్రకటించారు. అంతేకాదు నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్ ను వైసీపీ అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలని, తమ సొంత జేబులు నింపుకునే ప్రయత్నమే తప్ప, బడుగులను ఆదుకునే ప్రయత్నంచేయలేదని జగన్ ఆరోపించారు. తాను పింఛను రెండు వేలు ఇస్తానని ఇప్పుడు ప్రకటించానని, చంద్రబాబు కూడా రెండు వేలు ఇస్తామని చెబుతారేమోనని అన్నారు. అలా ప్రకటించినా మంచిదే కదా? తన వల్ల బడుగులకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు

Similar News