తిరుమల చేరుకున్న కేసీఆర్....

Update: 2017-02-21 19:30 GMT

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ‌్వరుని మొక్కు తీర్చుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబసమేతంగా తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహానికి సీఎం కేసీఆర్ కుటుంబం బస చేసింది. రాత్రికి అతిథి గృహంలోనే బస చేయనున్నారు. రేపు ఉదయాన్నే శ్రీవారిని సీఎం కేసీఆర్ దర్శించుకుని, తెలంగాణ మొక్కులును చెల్లించనున్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా తమకు కేటాయించిన అతిథి గృహాలకు చేరుకున్నారు. రేపు కేసీఆర్‌తో పాటే తెలంగాణ మంత్రులు కూడా శ్రీవారిని వారు దర్శించుకోనున్నారు.తిరుమల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రమే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రులు ఈటెల రాజేందర్‌, హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ ఎస్పీసింగ్‌, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ తదితరులు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి విమానాశ్రయ అధికారులు స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులంతా రోడ్డు మార్గం లో తిరుమలకు బయల్దేరి వెళ్లారు.

వైసీపీ నేతలు భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిరుమలలో వైకాపా నేతలు కలిశారు. రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు మిథున్‌రెడ్డి, పుంగనూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు ముఖ్యమంత్రి బస చేసిన శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకుని సీఎంతో సమావేశమయ్యారు. అంతకు ముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్న సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు తితిదే జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు.

Similar News