నంద్యాల ఉప ఎన్నికల్లో విజయంతో మంత్రి అఖిలప్రియ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. నంద్యాల జేజమ్మ అంటూ పట్టణంలో అతికించిన పోస్టర్లు ఆసక్తికరంగా మారింది. నంద్యాలలో ఒంటిచేత్తో....ఒంటరిగా తన అన్నను గెలిపించుకున్న అఖిలప్రియకు భూమా అనుచరులు పెద్దయెత్తున నీరాజనాలు పలుకుతున్నారు. నంద్యాలలోని ప్రతి వీధిలో ఈ పోస్టర్లు కన్పిస్తున్నాయి. నంద్యాల జేజమ్మ అఖిలప్రియ అని ఇక్కడ పశుపతి ఆటలు చెల్లవని ఆ పోస్టర్లలో ముద్రించారు.