నంద్యాల ఫలితాలపై ఎక్కువ టెన్షన్ పడుతుంది వీళ్లే

Update: 2017-08-25 02:30 GMT

ఏది ఏమైనా నంద్యాల ఫలితం తమకు అనుకూలంగా వుండాలని అందరికన్నా ఎక్కువగా కోరుకుంటున్నారుట ఆ ఎమ్యెల్యేలు . ఇంతకీ ఎవరు వారు అని అంటారా వారే అభివృద్ధి పేరుతో గోడదూకి అధికార టిడిపిలోకి జంపింగ్ ఇచ్చిన వైసిపి ఎమ్యెల్యేలు . ఈ ఎన్నికల ఫలితం వైసిపికి కానీ అనుకూలంగా ఉంటే ప్రతిపక్షం చేసే సవాళ్ళు, విమర్శలు, ఆరోపణలు మాట ఎలా వున్నా నియోజకవర్గంలో ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నారుట 20 మంది శాసన సభ్యులు . అందుకే అందరికన్నా అత్యధిక టెన్షన్ తో ఫలితం ఎదురుచూస్తున్నారు వారు . ఒక పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా అధికారపార్టీలోకి చేరడమే కాదు మంత్రి పదవులు సైతం పొందారు . తెలంగాణ లో సైతం అదే పరిస్థితి .

టిడిపి గెలిస్తే ....

అధికార టిడిపి ఎన్నికల్లో గెలిస్తే మాత్రం వైసిపి ని ఒక ఆట ఆడుకోవొచ్చని భావిస్తున్నారు . విపక్షం ప్రజల్లో విఫలం అయ్యిందన్న తమ ప్రచారానికి మరింత పదును పెట్టి వచ్చే ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకోవొచ్చనే ఆలోచనతో వున్నారు గోడ దూకిన ఎమ్యెల్యేలు .అందుకే ఈ ఎన్నికల ఫలితం ఇప్పుడు అటు టిడిపి కి ఇటు వైసిపి కి అత్యంత ప్రతిష్ట్మాకం అయ్యి కూర్చుంది . చావో రేవో అన్న రీతిలో నడిచిన ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి పోరాడారు రెండు ప్రధాన పక్షాలు . దాంతో సర్వత్రా నంద్యాల పోలింగ్ ముగిసినా ఫలితం పై మాత్రం ఎక్కడ నలుగురు చేరినా దానిపైనే చర్చలు కొనసాగుతున్నాయి .

Similar News