నంద్యాలలో ప్రజలు అభివృద్ధికే ఓటు వేశారని మంత్రి అఖిలప్రియ చెప్పారు. నంద్యాలలో టీడీపీ విజయం ఖాయమన్న అఖిలప్రియ నంద్యాలలో పెద్దయెత్తున మహిళలు ఓటర్లు పాల్గొనడమే ఇందుకు నిదర్శనమన్నారు. మహిళలు తమ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. వైసీపీ నేతలు, శిల్పా కుటుంబం టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకే ప్రయత్నం చేసిందని, అయితే తమ కార్యకర్తలు సంయమనం పాటించారని తెలిపారు. భూమా బ్రహ్మానందరెడ్డి విజయం ఖాయమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా తెలిపారు. మొత్తం మీద టీడీపీ నంద్యాల విజయం ధీమా వ్యక్తం చేసింది. నంద్యాలలో విజయం తమదేనని, తాము ఊహించిన దానికన్నా రెట్టింపు మెజారిటీ వస్తుందని మరో మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు.