నంద్యాల ఉప ఎన్నికపై ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ పెదవి విప్పారు. ఆయన నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందనుకోవడం వాస్తవం కాదని లగడపాటి అభిప్రాయపడ్డారు. కొందరు పోలింగ్ శాతం పెరిగినందున వైసీపీకి విజయావకాశాలున్నాయని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. వైసీపీ, టీడీపీలు నంద్యాల ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్నందునే పోలింగ్ శాతం పెరిగిందని లగడపాటి అభిప్రాయపడ్డారు. టీడీపీ పది శాతం ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తుందని, పదిహేడు వేల మెజారిటీ టీడీపీకి వచ్చే అవకాశముందని లగడపాటి చెప్పారు.
సర్వే కాదు... ఒపీనియన్ మాత్రమే......
ఆంధ్ర ఆక్టోపస్ గా పేరొందని లగడపాటి గతంలో జరిపించిన సర్వేలు వాస్తవమయ్యాయి. అనేక రాష్ట్రాల్లో మాజీ ఎంపీ లగడపాటి చేయించిన సర్వేలు సక్సెస్ కావడంతో ఈయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉంది. అయితే లగడపాటి నంద్యాల ఉప ఎన్నికల్లో సర్వే చేయించలేదు. తాను నంద్యాల ఉప ఎన్నికల్లో ఎటువంటి సర్వే చేయించ లేదని ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని లగడపాటి తెలిపారు. సో ఇది లగడపాటి సర్వే కాదు... కేవలం ఒపీనియన్ మాత్రమే.