నంద్యాల ఉప ఎన్నికలో యాభై శాతం ఓటింగ్ నమోదయింది. మధ్యాహ్నం ఒంటిగంటకే యాభై శాతం ఓట్లు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ ఇంత పోలింగ్ నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇంకా క్యూ లైన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఎండ తీవ్రత తక్కువగా ఉండటం, వాతావరణం చల్లగా ఉండటంతో పోలింగ్ కేంద్రాలకు పెద్దయెత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువత, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి చేరుతుండటంతో ఎన్నికను నంద్యాల ప్రజలు ఎంత సీరియస్ గా తీసుకున్నారో చెప్పకనే తెలుస్తోంది. రెండు ప్రధాన పార్టీలూ ఓటర్లను కేంద్రాల వద్దకు తరలించడంలో సఫలమయ్యాయనే చెప్పొచ్చు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే 80 శాతం దాటే అవకాశముంది.