నంద్యాలలో టీడీపీకి ఝలక్ ఇచ్చిన ప్రభుత్వ సిబ్బంది ఓట్లు

Update: 2017-08-28 02:48 GMT

తొలుత నంద్యాల ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. మొత్తం 250 ఓట్లు పోలవ్వగా అందులో 39 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ప్రధానంగా ప్రభుత్వోద్యోగులు ఈ పోస్టల్ బ్యాలట్ ను ఉపయోగించుకుంటారు. ఉద్యోగులే చెల్లనివిగా ఓట్లు వేయడం గమనార్హం. ఇంకా ఎవరికి ఎన్ని ఓట్లు పోలయినవీ తెలినప్పటికీ చెల్లనవి మాత్రం 39గా గుర్తించడం విశేషం. 211 ఓట్లు ఎవరికీ పడలేదు. దీంతో పోస్టల్ బ్యాలట్ ఓట్లు ఎవరికీ ఓట్లు చేయకపోవడం విశేషం. ప్రతి ఓటూ కీలకమైన నంద్యాల ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలో ఏ ఒక్క ఓటూ ఏ అభ్యర్థికీ పడకపోవడం గమనార్హం. ప్రభుత్వ వ్యతిరేకత వల్లనే ఉద్యోగులు ఓటు నోటాకు వేశారా? అన్న చర్చ జరుగుతోంది.

Similar News