నంద్యాలలో ఎనిమిదో రౌండ్ ఫలితాలు వచ్చాయి. ఈ రౌండ్ లోనూ టీడీపీ ఆధిక్యత కనపర్చింది. నంద్యాలలో టీడీపీ మెజారిటీ కొనసాగుతోంది. ఏడో రౌండ్ లో మెజారిటీ కొంత తగ్గినా ఎనిమిదో రౌండ్లోనూ టీడీపీకి 348 ఓట్ల మెజారిటీ లభించింది. ఆరు రౌండ్ల వరకూ వెయ్యి ఓట్లకు పైగానే మెజారిటీ సాధించిన టీడీపీ 7, 8 రౌండ్లలో మాత్రం మెజారిటీ మూడంకెలకు మించలేదు. ఏడో రౌండ్లో 512 ఓట్లు మెజారిటీ రాగా, ఎనిమిదో రౌండ్లో 348 ఓట్లు మాత్రమే మెజారిటీ లభించడం విశేషం. ఎనిమిది రౌండ్లు ముగిసే సమయానికి భూమా తన సమీప ప్రత్యర్థి శిల్పాపై 17228 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.