నంద్యాలలో తొలి రౌండ్ నంద్యాల రూరల్ మండలాన్ని లెక్కించనున్నారు. తర్వాత నంద్యాల పట్టణం ఓట్లను లెక్కిస్తారు. చివరగా ఉత్కంఠ రేపుతున్న గోస్పాడు మండలం ఓట్లను కౌంట్ చేస్తారు. అంటే తొలి మూడు రౌండ్లలో గ్రామీణ ప్రాంతాల ఓటర్ల ట్రెండ్ అర్ధమవుతుంది. తర్వాత నంద్యాల పట్టణం ఓట్లు లెక్కిస్తుండటంతో పట్టణ ఓటర్లు కూడా ఎటు వైపు మొగ్గు చూపుతారనేది తెలుస్తోంది. చివరగా రెండు పార్టీలు తమకు అనుకూలమని భావిస్తున్న గోస్పాడు మండలం ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 9.30 గంటలకల్లా ట్రెండ్ తెలిసిపోతుంది. 11.30గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశముంది.