నంద్యాలలో పోటెత్తిన ఓటర్లు

Update: 2017-08-23 10:37 GMT

నంద్యాల ఉప ఎన్నికలో 70 శాతం ఓటింగ్ నమోదయింది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సమయానికి 70 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ కు ఇంకా రెండు గంటల సమయం ఉండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది. ప్రధానంగా గ్రామాల్లో పోలింగ్ 90 శాతానికి పైగానే నమోదయ్యాయి. గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలు ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. నంద్యాల పట్టణంలో మాత్రం కొంత మందకొడిగానే సాగుతోంది. నంద్యాల పట్టణంలో ఇప్పటి వరకూ 60 శాతం మాత్రమే పోలింగ్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు.

Similar News