నంద్యాలలో రికార్డ్‌ పోలింగ్‌......79.20శాతం

Update: 2017-08-24 02:30 GMT

నంద్యాల ఉప ఎన్నికల్లో రికార్డు శాతం పోలింగ్ నమోదు అయ్యింది. వైసీపీ-టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో 79.20 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. .మొత్తం 2.19లక్షల ఓట్లలో 1,73, 335 ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ ప్రకటించారు. ఓటర్లలో 88,503 మహిళలు కాగా పురుషులు 84, 831 ఓటు హక్కును వినియోగించుకున్నారు. నంద్యాల అర్బన్‌ ప్రాంతంలో ఓటింగ్‌ 74.06 కాగా,రూరల్‌ ప్రాంతంలో 87.61 శాతంగా నమోదయ్యింది.

గోస్పాడులో అధికం.......

గోస్పాడులో అత్యధికంగా 90.81శాతం ఓటింగ్‌ నమోదైంది. 2009లొ నంద్యాలలో 76 శాతం పోలింగ్‌ నమోదు కాగా 2014 లో 71శాతం పోలింగ్‌ నమోదైంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జరిగాయని భన్వర్‌లాల్‌ చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు 72 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేయడం సత్ఫలితాలనిచ్చిందన్నారు. కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జగన్‌పై ఆర్వో చర్యలు తీసుకుంటారని భన్వర్‌లాల్‌ చెప్పారు. ఎన్నికల విధుల్లో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి 10లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

Similar News