మీడియా తో అంతే.... ఎంత లేపుతుందో...అంత పడేస్తుంది. ఛాన్స్ వస్తే ఎవరిని ఏమైనా చెయ్యగలరు. ఎక్కడైనా పెట్టగలరు. IAS అధికారిణి పూనమ్ మాలకొండయ్యకు చాలా మంచి పేరు ఉంది. గతం లో ఆమెను కీర్తిస్తూ ఎన్నో పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే గత కొంత కాలం గా ఆమె వైఖరిపై ఎందుకో విమర్శలు పెరిగాయి. కొందరికి అనుకూలం గా ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
రెండు నెలల నుంచి ఏదో ఒక ఆరోపణ.......
ఇదిలా ఉంటే ఒక రోజు...దాదాపు రెండు నెలల క్రితం అనుకుంటా కాబినెట్ మీటింగ్ లో హెల్త్ ఇష్యూ లపై సీఎం గట్టిగా క్లాస్ పీకారు. హెచ్చరించినా ఏజెన్సీ లో వైద్యం గురించి అశ్రద్ధ పై గట్టిగానే మందలించారు. విషయం 1st బ్లాక్ దగ్గర ఉన్న మీడియా కు తెలిసింది. దీంతో కేబినెట్ మీటింగ్ లో పూనమ్ పై సీఎం మండిపాటు అని మీడియా లో ప్రముఖంగా వచ్చింది. కాబినెట్ లో సీఎం మంత్రులను తిట్టడం సాధారణమే అయినా... ఒక IAS కు ఆస్థాయి లో గట్టిగా సూచనలు చెయ్యడం పెద్ద చర్చ అయ్యింది. మీడియా లో వార్తలు తెలుసుకున్న పూనమ్ మాలకొండయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నిహితుల దగ్గర డర్టీ మీడియా అని కామెంట్ చేశారు. ఇది రెండో రోజే బయటకు వచ్చింది. దీంతో మీడియా వాళ్లకు మండింది. అంత గౌరవం ఇచ్చే మీడియాను అంత మాట అంటారా అని చర్చ జరిగింది. ఇదే సమయం లో విశాఖ మెడ్ టెక్ స్కాం జరగడం, దానిపై CS కు, CMO కు ఫిర్యాదులు వెళ్లడం జరిగింది. జితేంద్ర శర్మ అనే సలహదారుని పూనమ్ కాపాడుతుంది అనే ఆరోపణ వచ్చింది. ఫిర్యాదు చేసిన వారిని పూనమ్ సంస్థ నుంచి తొలగించడం తో ఆరోపణలకు బలం చేకూరింది. దీనికి తోడు అక్రమాల నిగ్గు తేల్చక పోగా... కంప్లయింట్ చేసిన వాళ్ళను జైల్ లో పెట్టడం...మంత్రి దీనికి మద్దతు ఇవ్వడం తో రచ్చ రచ్చ అయ్యింది.
ఆరోపణలు చేసిన వారిపై చర్యలా?
పూనమ్ విషయం లో అప్పటికే కోపం గా ఉన్న మీడియా...పెద్ద స్కాం దొరకడం తో గట్టిగా రాసింది. ఇటు మంత్రి తప్పిదాలు, అటు పూనమ్ నిర్ణయాలను కడిగేసింది. మీడియా ను ఢీకొనాల...లేక అక్రమాల ఉంటే చర్యలకు దిగాల అనే విషయం లో స్పష్టత లేకుండా శాఖ పెద్దలు వ్యవహరించారు. గోటి తో పోయేదాన్ని దొడ్డలి వరకు తెచుకున్నట్లు....తమపై ఆరోపణలు చేసిన వారి కాల్ డేటా తెప్పించి బెదిరింపులకు పాల్పడడం, ఫిర్యాదు చేసిన కేరళకు చెందిన వ్యక్తిని దేశద్రోహం చేసినట్లు 15 రోజులు జైల్ లో పెట్టడం తో ఇష్యూ మరింత రచ్చ గా మారింది. అక్రమాలు ఎంత జరిగాయా అన్నది పక్కన పెడితే వ్యవహారం లో మంత్రి, పూనమ్ వ్యవహరించిన విషయాన్ని పెద్దది చేసింది. అసలు స్కాం ఏంటి....ఏమి జరిగింది....పాత్ర దారులపై చర్యల విషయం లో కూడా కఠినం గా వ్యవహరించాలి. అందుకే మీడియా విషయం లో ఎవరైనా కాస్త పద్దతిగా ఉంటే మంచిది.