నేను రాను పోండి

Update: 2018-03-01 02:20 GMT

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మొహమాటం లేకుండా మాట్లాడారు. ఈ కుంభకోణంపై విచారణలో పాలు పంచుకోవాలని ఆయనను సీబీఐ కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్, నెవిస్‌లో ఉన్న ఆయనకు సీబీఐ ఈ-మెయిల్ ద్వారా ఈ పిలుపునిచ్చింది. దీనికి ఆయన నిక్కచ్చిగా సమాధానం పంపించారు. ‘‘మాకు విదేశాల్లో వ్యాపారాలున్నాయి, అందువల్ల నేను దర్యాప్తులో పాల్గొనలేను’’ అని తెలిపారు.

మరొక ఈమెయిల్.....

నీరవ్ స్పందనపై సీబీఐ ప్రతిస్పందిస్తూ మరొక ఈ-మెయిల్‌ను ఆయనకు పంపించింది. ‘‘మీరు ఉన్న దేశంలోని హై కమిషన్‌ను సంప్రదించండి. మీ ప్రయాణానికి సీబీఐ ఏర్పాట్లు చేస్తుంది’’ అని తెలిపింది. వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే దర్యాప్తులో తప్పనిసరిగా పాల్గొనాలని పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ కుంభకోణం కేసులో నీరవ్ మోడీ నిందితుడు. రూ.11,400 కోట్ల మేరకు ఆయన మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నాయి.

Similar News