న్యాయం చేస్తామని చెబుతున్నా...

Update: 2018-03-09 06:01 GMT

ఏపీకి కేంద్రం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మాజీ కేంద్రమంత్రి పురంద్రీశ్వరి అన్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం అలక్ష్యం చేయబోదన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి పెద్దగా లాభం ఉండదనే జైట్లీ చెప్పారన్నారు. ఈశాన్య రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా కొనసాగించలేదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర విద్యాసంస్థలకు తక్కువ నిధులిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పురంద్రీశ్వరి అభిప్రాయపడ్డారు. కేంద్రం చొరవ కారణంగానే ఏపీలో పెట్టుబడులు పెరిగాయన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 2,500 కోట్లు ఇచ్చిందన్నారు. రెవెన్యూ లోటు పూడ్చటానికి కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఏపీలో వెనుకబడ్డ ప్రాంతాలకు ఇప్పటికే పన్ను రాయితీలు ఇచ్చారని ఆమె తెలిపారు.

Similar News