పళని, పన్నీర్ కు 40 మంది ఎమ్మెల్యేల షాక్

Update: 2017-08-28 05:38 GMT

పళని, పన్నీర్ సెల్వానికి ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశానికి అన్నాడీఎంకే కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టడంతో తమిళనాట రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే దినకరన్ వెంట 23 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్వహించిన సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడంపై పళనిస్వామిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కీలక భేటీకి ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడానికి కారణాలు తెలియరాలేదు.

Similar News