పాతబస్తీని షేక్ ఆడిస్తూ... అమ్మాయిలను వలలో వేసుకుంటూ

Update: 2017-08-25 10:30 GMT

విమానంలో వస్తాడు.. వయస్సు అరవై ఏళ్లకు పైగానే వుంటుంది. తన మనవరాలు వయస్సు అమ్మాయిని కాంటాక్టు మ్యారేజీ చేసుకుంటాడు. కొన్నాళ్లు ఎంజాయ్ చేస్తాడు. తర్వాత తలాక్ అంటూ చేతులు దులుపుకుని పోతున్న అరబ్ షేక్ ల తీరు ఇది. కాంటాక్ట్ మ్యారేజ్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్న అరబ్ షేక్ లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి కటాకటాలవెనక్కి నెట్టిన తీరు.. దేశ వ్యాప్తంగా త్రిపుల్ తలాక్ పైన ముస్లిం మహిళలు పండగ చేసుకుంటూ ఉంటే హైదరాబాద్ లో మాత్రం ఇంకా పాత పద్ధతులే కొనసాగుతున్నాయి. ఎప్పడో మానిన గాయాలు మళ్లీ ఈ పాతబస్తీలో రాజుకుంటున్నాయి. కాంటాక్టు మ్యారేజీలకు ఎప్పడు పుల్ స్టాప్ పడింది లేదు . హైదరాబాద్ లోని అమ్మాయిలపైన ఆరబ్ షేక్ కన్ను ఇంకా మానలేదని చెప్పవచ్చును...పాతబస్తీల అమ్మాయిల కోసం అరబ్ కంట్రీల షేక్ లు ఇంకా క్యూలు కడుతున్నానే వున్నారు. డబ్బులు ఇచ్చి మరి కాంటాక్ట్ మ్యారేజీలు చేసుకుంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను టార్గెట్ గా చేసుకుని ఈ దందా కొనసాగుతుంది. అరబ్ షేక్ లకు హైదరాబాద్ లోని బ్రోకర్స్ ఒక అడ్డా అని చెప్పవచ్చు. ఇది నిజం ..హైదరాబాద్ లో మరొక సారి కాంటాక్ట్ మ్యారేజీ దురాగతం వెలుగులోకి వచ్చింది.

వయసు అరవై అయినా....యువతి కావాల్సిందే.....

పాతబస్తీలోని మైలార్ దెవ్ పల్లికి చెందిన షామీమ్ కు గతంలో వివాహం అయ్యింది. ఈ వివాహం కాస్తా తలాక్ కు దారి తీసింది. దీంతో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. తనకు తోడుగా ఎవరైనా వుంటే బాగుంటుందని అనుకుంటుంది. తను ఒంటరిగా తన తల్లిదండ్రుల వద్దనే వుంటుంది షామీమ్. ఇక్కడ వరకు బాగానే వుంది. ఇటివల కాలంలో ఒక బ్రోకర్ అయిన షఫీ కనబడ్డాడు. తన కూతురుకు వివాహం చేయాలని అనుకుంటున్నట్లుగా షామీమ్ తండ్రి చెప్పాడు. దీంతో తనకు దుబాయ్ లో తెలిసిన వ్యక్తి వున్నాడు . రెండో వివాహం చేసుకునే ప్లాన్ లో వున్నాడు. అని చెప్పాడు. షఫీ.. బ్రొకర్ షఫీవెంటనే ఒమన్ లో వుంటున్న సయ్యద్ ను కాంటాక్ట్ చేశాడు షఫీ. గత నెల 10వ తేదీన సయ్యద్ ఇండియాకు వచ్చాడు. ఇక్కడి వచ్చిన తరువాత షామీమ్ ఇంటిలోనే మకాం వేశాడు. నాలుగు రొజుల్లో పెండ్లి తంతు ముగిసింది. అయితే వివాహం అయిపోయింది. పేపర్స్ ముంబయ్ నుంచి రావాల్సి వుందని చెప్పి షామీమ్ ఇంటిలోనే కాపురం పెట్టారు. అయితే ఈ వివాహం కుదిర్చినందుకు బ్రోకర్ షఫీకి 70 వేల రూపాయలను ఇచ్చాడు సయ్యద్. ఈ 70 వేల రూపాయల్లో బ్రోకర్స్ తనకు 30 వేలు వుంచుకుని షామీమ్ కుంటుబానికి 40 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు బ్రోకర్.

కాంటాక్ట్ మ్యారేజీ అని చెప్పి.......

ఇక పొతే నకీలీ పత్రాలతో షామీమ్ తో వివాహాం చేసుకున్నాడు. 28 ఏళ్ల వయస్సు వున్న షామిమ్ ను 66 సంవత్సరాల వున్న సయ్యద్ వివాహాం చేశాడు బ్రొకర్ షఫీ. ఈ ఒమన్ షేక్ కు ఇప్పటికే వివాహం అయ్యింది. భార్య, పిల్లలు కూడా ఒమన్ లో వున్నారు. ఇతను ఒక రిటైర్డు పోలీసు అధికారి.. ఆరు సంవత్సారా ల క్రితం రిటైర్టు అయ్యాడు ఈ షేక్ సయ్యద్. అయితే మధ్యలో వున్న బ్రోకర్ మాత్రం ఇది కాంటాక్ట్ మ్యారేజీ అయినప్పటికి షామీమ్ తో పాటుగా తల్లిదండ్రులకు మాత్రం ఈ విషయం చెప్పలేదు. షామీమ్ ను వివాహాం చేసుకుని కొన్నిరొజుల పాటుగా ఎంజాయ్ చేసి వదిలిపెట్టి పోయాడు సయ్యద్. తాను చేసుకున్న కాంటాక్ట్ మ్యారేజీ సక్సెస్ కావడంతో తన తమ్ముడైన ముస్తాఫాను ఇండియాకు రప్పించాడు... ఈ ముస్తాఫా కొత్త డిమాండ్ పెట్టాడు.తాను మైనర్ ను అయితేనే వివాహం చేసుకుంటానని చెప్పాడు. అంతేగాకుండా అందమైన అమ్మాయి అయితే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఇందుకు బ్రోకర్ ఒప్పుకున్నాడు. వెంటనే తనకు తెలిసిన పది మంది అమ్మాయి ల ఫొటోలను వాట్సప్ ద్వారా ముస్తాఫా కు పంపించాడు. ఇందులో నలుగురు అమ్మాయిలను ముస్తాఫా సెలక్ట్ చేసుకున్నాడు. తాను హైదరబాద్ కు వచ్చి ఇందులో ఇద్దరిని కాంటాక్ట్ వివాహం చేసుకుంటానని చెప్పాడు.ఇందుకు సంబంధించిన పత్రాలను రెడీ చేయాలని కూడా బ్రోకర్ ను ఆదేశించాడని పోలీసులుతెలిపారు.

బ్రోకర్ షఫీది కీలకపాత్ర.....

ఇక పొతే మూడు రోజుల క్రితం ముస్తాఫా కూడా హైదబరాద్ కు చేరుకున్నాడు. అతను వస్తునే షామీమ్ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే తన అన్న కాపురం చేస్తున్న షామీమ్ ఇంటిలో రెండు రొజుల పాటు ఎంజాయ్ చేశాడు ముస్తాఫా. మైలార్ దెవ్ పల్లిలో కాంటాక్ట్ వివాహం జరుగుతున్నట్లుగా సమాచారం తెలుసుకుని వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు అరబ్ షేక్ లైన సయ్యద్. ముస్తాఫాలను పోలీసుల అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం మొత్తం బయటికి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఇదిలా వుంటే బ్రొకర్‌ షఫీ ని అరెస్టు చేయగా, అతని వద్ద వందల సంఖ్యలో అమ్మాయిల ఫొటోలు లభ్యం అయ్యాయి. అదే విధంగా కొన్ని వందల సంఖ్యలో వాయిస్ రికార్డులు కూడా దొరికాయి. ఇందులో అరబ్ షేక్ లు బ్రోకర్ షఫీలు మాట్లాడుకున్న మాటలు వున్నాయి. మరొక వైపు పాతబస్తీలోని ఒక ఖాజీ కి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి ఈ కాంటాక్ట్ వివాహాలు చేయిస్తున్నాడు బ్రోకర్ షపీ. ఇప్పటికే పలు కాంటాక్ట్ మ్యారెజీలు చేయించినట్లుగా పోలీసులు విచారణ లో వెలుగు చూసింది. మ్యారేజీలు చేయించి కొన్నాళ్లు పాటుగా ఇక్కడే వుంటే అరబ్ షేక్ లు కాపురం చేసే విధంగా ఏర్పాట్లు కూడా ఈ బ్రొకరే చేస్తుంటారు. అరబ్ కు అమ్మాయి మీద మోజు తీరగానే మరొక అమ్మాయిని కట్టబెట్టి డబ్బులు సంపాదిస్తున్నాడు ఈ బ్రోకర్. ఇప్పటికే చాల మంది అమ్మాయిలకు వివాహం చేసి అరబ్ దేశాలకు కూడా ఈ బ్రోకర్ పంపించాడు. ఏది ఏమైనా నగరంలో వెలుగు చూసిన ఈ కాంటాక్ట్ మ్యారేజీలపై పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నా బ్రోకర్ల చేతిలో పడి పాతబస్తీ యువతులు మోసపోతున్నారు.

Similar News