ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తాను పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన బీజేపీని వీడి టీడీపీలో చేరతారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవన్నీ వదంతులేనని కామినేని కొట్టిపారేశారు. తన ప్రాణమున్నంత వరకూ బీజేపీలోనే కొనసాగుతానని చెప్పారు. బీజేపీ వల్లనే తాను ఈ స్థాయికి చేరానని మంత్రి కామినేని చెప్పారు. అగ్రనాయకత్వం, వెంకయ్యనాయుడి ప్రోత్సాహంతోనే తాను బీజేపీలో చేరానని, ఇక పార్టీని విడిచి వెళ్లే ప్రసక్తి లేదని కామినేని తేల్చి చెప్పారు. తాను అందరితో కలసి మెలసి ఉంటానని, అందువల్లనే తనపై వదంతులు వస్తున్నాయని కామినేని అభిప్రాయపడ్డారు.