పొలిటికల్ లీడర్స్....పేకాటరాయుళ్లు

Update: 2018-03-02 03:41 GMT

తెలంగాణ రాగానే ప్రభుత్వం వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. జీవితాలను బుగ్గి పాలు చేస్తున్న పేకాట క్లబ్ లను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. రిక్రియేషన్ క్లబ్ ల పేరుతో నడుస్తున్న ఈ పేకాట కు పూర్తిగా అడ్డుకట్ట వేసింది ప్రభుత్వం. ఎక్కడ పేకాట నడువకుండా పోలీసులకు పూర్తి స్థాయిలో అధికారులను కూడా ఇచ్చింది.పేకాట ఆడిన వారితో పాటుగా ఆడిస్తున్న వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇప్పడు పేకాట క్లబ్ లు ఎక్కడ లేవు కాని. అపార్టమెంట్స్ , ఫామ్ హౌజ్ లు ఇప్పడు పేకాట స్దావరాలుగా మారాయి..కాంక్రీట్ జంగిల్ లో గుట్టుచప్పుడు కాకుండా ఈ పేకాట అపార్ట్ మెంట్స్ లో నడుస్తోంది.

ఫామ్ హౌస్ లలో గుట్టు చప్పుడు కాకుండా....

అయితే పండగలు పబ్బాలు వచ్చినప్పడు ఈ పేకాట దందా పెద్దగా కొనసాగుతుంది. ఈపేకాట ఆడిస్తుంది ఎవరో కాదు. రాజకీయ నాయకులే. ఇది నిజం గత రెండు రొజుల్లో ఫామ్ హౌజ్ ల మీద దాడి చేయగా ఇరవై మంది రాజకీయ నాయకులను పోలీసులు పట్టుకున్నారు. వీరంతా వివిధ రాజకీయ పార్టీలో పనిచేస్తున్న వారే. రాజకీయ నాయకులం తాము ఏం చేసినా నడిచిపొతుందన్న ధీమాతో వీరు పేకాట ఆడుతున్న తీరు ఇది. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ పార్టీ మీటింగ్ ల పెరు మీద ఫామ్ హౌజ్ లను అద్దెకు తీసుకుంటున్నారు. ఇలా అద్దెకు తీసుకున్న ఫామ్ హౌజ్ లో ఆర్గనైజింగ్ గా పేకాట ఆడిస్తున్నారు. శామీర్ పేట్, నార్సింగి, గండి పేట్, రాజేంద్రనగర్ , మెయినాబాద్ ఏరియాలో వున్న ఫామ్ హౌజ్ ల మీద దాడి చేసి మొత్తానికి అరవై మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముప్పే మందికి పైగా రాజకీయ నాయకులు వున్నారు. వీరితో పాటు చాలా మంది బిజినెస్ మెన్ లు కూడా పోలీసులకు పట్టుబడిన వారిలో వున్నారు.

Similar News