నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజ గోపాల్ జోస్యం నిజం కాబోతోంది. నాలుగో రౌండ్ ఫలితం వెలువడే నాటికి 9670 ఓట్ల మెజారిటీ లభించింది. నిజానికి నంద్యాల ఉప ఎన్నికలో ఎవరు గెలిచినా 7-8 వేలకు మించి మెజారిటీ లభించదని అంతా భావించారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత లగడపాటి టీడీపీ 20వేలకు పైన మెజారిటీ తో గెలుస్తుందని చెప్పారు. 2008 నుంచి లగడపాటి ఈ తరహా ముందస్తు సర్వే లు చెబుతూ వస్తున్నారు. అప్పట్లో ఓ ఆక్టోపస్ చెప్పే జోస్యాలు నిజం అవుతూ ఉండటంతో లగడపాటి ఆంధ్రా ఆక్టోపస్ అయ్యాడు. 2014 తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నా ఉప ఎన్నిక ఫలితాలపై లగడపాటి సొంత సర్వే చేయించారు. చివరకు ఆయన చెప్పినట్లే ఫలితాల సరళి రావడం విశేషం.