ఫుల్ జోష్ లో చంద్రబాబు

Update: 2017-08-28 05:24 GMT

నంద్యాలలో టీడీపీ విజయం దిశగా దూసుకెళుతుండటంతో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు సీఎం చంద్రబాబు నివాసం వద్ద బాణా సంచా కాలుస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈరోజు తన నివాసంలోనే ఉండి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు. ఆయన పూర్తి సంతోషంలో ఉన్నారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, అచ్చెన్నాయుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లు వచ్చారు. వారితో కలిసి చంద్రబాబు ఫలితాలను సమీక్షిస్తున్నారు.

Similar News