నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తొలి రౌండ్ నుంచి టీడీపీ ఆధిక్యం కనబరుస్తోంది. తొలి రౌండ్ లో 1198 ఓట్లు మెజారిటీ సాధించిన భూమా బ్రహ్మానందరెడ్డి రెండో రౌండ్లో 1618 ఓట్లు మెజారిటీ సాధించారు. రూరల్ మండలంలో టీడీపీ మెజారిటీ సాధించడంతో వైసీపీ శ్రేణుల్లో నిరాశ కలుగుతోంది. అయితే ఓపెనింగ్ లోనే టీడీపీ మెజారిటీ సాధిస్తుండటంతో తర్వాత లెక్కింపు జరిగే నంద్యాల పట్టణం తమదేనంటున్నారు టీడీపీ నేతలు. అయితే ఇంకా 17 రౌండ్లు ఉండటంతో వైసీపీ శ్రేణుల్లో కొంత ఆశ అయితే కన్పిస్తోంది.