నంద్యాల ఉప ఎన్నికల్లో అయిదో రౌండ్లోలనూ టీడీపీ ఆధిక్యత కనబర్చింది. నంద్యాలలో టీడీపీ హవా కొనసాగుతోంది. ప్రతి రౌండ్ లోనూ టీడీపీకే మెజారిటీ దక్కుతోంది. ఐదో రౌండ్లో టీడీపీకి దాదాపు మూడు వేల ఓట్లు ఆధిక్యత లభించింది. దీంతో ఐదు రౌండ్లు ముగిసే సమయానికి టీడీపీ మెజారిటీ దాదాపు 12వేల పైచిలుకే. దీంతో ఇక టీడీపీ విజయం నంద్యాలలో ఖాయంగా కన్పిస్తోంది.