నంద్యాల ఉప ఎన్నికల్లో సైకిల్ దూసుకెళుతోంది. మూడు రౌండ్లలోనూ టీడీపీ స్పష్టమైన ఆధిక్యత లభించింది. మూడో రౌండ్ లో 3,113 ఓట్ల ఆధిక్యత రావడంతో ఇప్పటికి బ్రహ్మానందరెడ్డి, శిల్పా కంటే 6,073 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలిరౌండ్ 1198 ఓట్లు, రెండో రౌండ్లో 1634లో టీడీపీ ఆధిక్యం, మూడో రౌండ్లో 3,113 ఓట్ల మెజారిటీ సాధించింది. దీంతో టీడీపీ నంద్యాలలో దూసుకెళుతోంది.