నంద్యాల ఉప ఎన్నికల్లో నాల్గో రౌండ్లోలనూ టీడీపీ ఆధిక్యత కనబరుస్తోంది. నంద్యాలలో టీడీపీ హవా కొనసాగుతోంది. ప్రతి రౌండ్ లోనూ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆధిక్యం కనపరస్తుండటమే విశేషం. ఇదే ఆధిక్యం కొనసాగితే నంద్యాలలో టీడీపీకి భారీ మెజారిటీ లభించే అవకాశం ఉందంటున్నారు. నాల్గోరౌండ్ తర్వాత 9,670 ఓట్ల మెజారిటీ సాధించింది. నాల్గో రౌండ్ లో 3597 ఓట్ల ఆధిక్యత లభించింది. దీంతో నాలుగు రౌండ్లలోనూ భూమాదే పైచేయిగా కన్పిస్తోంది.