నంద్యాలలో రెండో రౌండ్ లో కూడా టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి స్పష్టమైన ఆధిక్యత లభించింది. నంద్యాల రూరల్ లో టీడీపీకి ఆధిక్యత రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మొదటి రౌండ్ లో 1198 ఓట్ల ఆధిక్యం సాధించిన భూమా రెండో రౌండ్ లోనూ తన ఆధిక్యతను కొనసాగించనున్నారు. రెండో రౌండ్ తర్వాత 2800 ఆధిక్యాన్ని టీడీపీ ప్రదర్శిస్తోంది. రెండో రౌండ్ లో 1618 ఓట్ల ఆధిక్యత టీడీపీకి వచ్చింది.