బ్రేకింగ్: మూడో రౌండ్లోనూ భూమాదే ఆధిక్యం

Update: 2017-08-28 03:57 GMT

నంద్యాలలో మూడో రౌండ్లోనూ టీడీపీ ఆధిక్యం కనబరిచింది. మూడో రౌండ్ లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి దాదాపు మూడు వేల మెజారిటీ లభించింది. దీంతో తొలి మూడు రౌండ్లలోనూ టీడీపీ ఆధిక్యం కనపర్చింది. ఇప్పటి వరకూ బ్రహ్మానందరెడ్డి దాదాపు ఆరు వేల ఓట్ల మెజారిటీ దక్కింది. తొలి రెండు రౌండ్లలో 2819 ఓట్లు మెజారిటీ రాగా మూడో రౌండ్లో దాదాపు మూడు వేల మెజారిటీ రావడంతో టీడీపీ ఆనందం వ్యక్తం చేస్తోంది. మూడో రౌండ్ నంద్యాల పట్టణం ఓట్లను లెక్కిస్తున్నారు. ప్రస్తుతం భూమా బ్రహ్రానందరెడ్డికి 10,639 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి 7679 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 211 ఓట్లు లభించాయి.

Similar News