బ్రేకింగ్ : లోక్ సభలో నాల్గో రోజూ అవిశ్వాసం రాకుండానే

Update: 2018-03-21 06:39 GMT

వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ ప్రారంభమయినా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదు. సభలో టీఆర్ఎస్, అన్నాడీఎంకేలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆందోళనల మధ్యనే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభా కార్యక్రమాలను చేపట్టారు. సభ్యులు ప్రశాంతంగా ఉండాలని, తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై చర్చించడానికి సిద్ధంగా ఉందని, సభ ను ఆర్డర్లో ఉంచాలని సూచించారు. నినాదాల మధ్యనే వైసీపీ, టీడీపీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ చదివి విన్పించారు. సభ ఆర్డర్ లో లేకపోవడంతో లోక్ సభను రేపటికి సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు. రిజర్వేషన్ల పెంపుపై టీఆర్ఎస్, కావేరీ జలాలపై అన్నాడీఎంకే సభ్యులు నినాదాలు చేస్తూనే ఉండటంతో సభను రేపటికి వాయిదా వేశారు.

Similar News