బ్రేకింగ్ : వెంకయ్య ఆగ్రహం..ఎందుకంటే?

Update: 2018-04-04 05:54 GMT

రాజ్యసభలో ఈరోజు కూడా కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. తెలుగు ఎంపీలు కూడా తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. దీంతో రాజ్యసభలో గందరోళం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఎంపీలపై అసహనం వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించ వద్దని, నినాదాలు చేయవద్దని వెంకయ్య పదే పదే కోరారు. 11 రోజుల సభ సమయాన్ని వృధా చేశారంటూ వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రయోజనం కోసం మీరు ఈ ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నోబిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటి ఆమోదానికి సహకరించాలని వెంకయ్యనాయుడు పదే పదే కోరారు. అయినా సభ్యులు శాంతించలేదు. కావేరీ, ఏపీ, బ్యాంకుల అంశాలపై చర్చిద్దామని, తాను చర్చకు అనుమతిస్తానని ఆందోళన విరమించమని వెంకయ్య కోరారు. అయినా సభ్యులు శాంతించక పోవడంతో రాజ్యసభను వెంకయ్య నాయుడు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.

Similar News