మంత్రి గంటాపై అరెస్ట్ వారెంట్

Update: 2017-08-23 12:08 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అనకాపల్లి కోర్టు ఝలక్ ఇచ్చింది. మంత్రి గంటాకు అనకాపల్లి కోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. 2009 ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేలా, క్రికెట్ కిట్లు పంపిణీచేశారని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. అయితే ఆయనను కోర్టుకు హాజరు కావాల్సిందిగా అనేకసార్లు కోరినా గంటా హాజరుకాకపోవడంతో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒక్క వాయిదాకు కూడా గంటా హాజరుకాకపోవడం వల్లనే నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

Similar News