నంద్యాలలో మధ్యాహ్నం నుంచి గొడవలు జరిగే అవకాశముందని తమకు పక్కా సమాచారం వచ్చిందని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం గొడవలు చేయాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఈ విషయాన్ని పోలీసలకు తెలియజేసినట్లు చెప్పారు. తనను, తన కుటుంబాన్ని అధికార పార్టీ అనేక ఇబ్బందులు పెట్టిందని, కాని నంద్యాల ప్రజలు తనవెంటే నిలుస్తున్నారన్న నమ్మకం ఉందన్నారు. మధ్యాహ్నం తర్వాత అప్రమత్తంగా ఉండాలని తమ పార్టీ క్యాడర్ ను కూడా కోరినట్లు శిల్పా చెప్పారు.