నంద్యాల ఉప ఎన్నికల్లో 11 గంటల వరకూ దాదాపు 39 శాతం పోలింగ్ అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ కు పెద్దయెత్తున తరలి రావడంతో ఉదయం 11 గంటలకే 39 శాతానికి చేరడంతో ఇది 80 శాతం దాటే అవకాశమున్నట్లు కన్పిస్తోంది. సాయత్రం ఆరుగంటల వరకూ పోలింగ్ జరగనుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం అత్యధికంగా నమోదయ్యే అవకాశముంది. 1983లో నంద్యాల నియోజకవర్గంలో 73. 84 శాతం పోలింగ్ నమోదయింది. ఇదే నంద్యాల నియోజకవర్గ చరిత్రలో అధికం. గత ఎన్నికల్లో 72.09 శాతం నమోదయింది. పాత రికార్డులను ఈసారి అధిగమించే అవకాశముందంటున్నారు.