రెండు వేల రుపాయల నోట్ల రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. అలాంటి ప్రతిపాదన ఏది లేదని స్పష్టం చేశారు. రూ.200నోట్లను మార్కెట్లోకి విడుదల చేసే విషయంలో ఆర్బీఐకి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. నోట్లను ఎప్పుడు విడుదల చేయాలనేది ఆర్బీఐ ఇష్టమని చెప్పారు. రూ.500., 1000 నోట్ల రద్దు తర్వాత రూ.500., రూ.2వేల కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. అదే సమయంలో చిన్న నోట్ల లభ్యత కరువై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చింది. కొత్త రూ.200 నోట్ల ముద్రణ ఎప్పుడు జరుగుతుందో., వాటిని ఎప్పడు చలామణీలోకి తీసుకురావాలనే విషయాలను ఆర్బీఐ చూసుకుంటుందని చెప్పారు. రూ.2వేల నోట్లను రద్దు చేసే ఆలోచన మాత్రం లేదని జైట్లీ స్పష్టం చేశారు.